ఈబిసి నేస్తం చెక్కు అందజేత

Mar 14,2024 17:45 #collector, #Kakinada, #ysr ebc scheem

ప్రజాశక్తి కాకినాడ : జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 9,516 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గురువారం రూ.14 కోట్ల 27 లక్షల ను నంద్యాల జిల్లా బనగానపల్లె లో జరిగిన ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు.  ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాలు నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంభందించిన చెక్కును అందజేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ ఇతర ఓసి కులాలకు చెందిన 45-60 సంవత్సరాల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కాకినాడ జిల్లాలో ఈ బి సి నేస్తం కింద 2021-22 సంవత్సరంలో 8,883 మందికి రూ.13 కోట్ల 32 లక్షలు, 2022-23 లో 9,995 మందికి రూ.14 కోట్ల 99 లక్షలు అందజేశారు. ఈ ఏడాదికి గాను గురువారం 9,516 మందికి రూ. 14.కోట్ల 27 లక్షల ను విడుదల చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కృతీకా శుక్లా, ఎం ఎల్ సి కర్రీ పద్మశ్రీ , ఎస్ సి కార్పొరేషన్ ఛైర్పర్సన్ పెదపాటి అమ్మజి , పెరిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పురుషోత్తం గంగాభవాని , కూడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి , జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఈడి ఏ. శ్రీనివాస రావు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ,తదితరులు పాల్గొన్నారు.

➡️