ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’

Jan 23,2024 17:57
ఆర్థికాభివృద్ధికి 'ఆసరా'

– ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం: ఎంపీ రెడ్డెప్ప- 4వ విడతలో జిల్లాకు సంబంధించి రూ.324కోట్ల లబ్ధి: కలెక్టర్‌ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్టు ఎంపీ రెడ్డెప్ప అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం స్వయం సహాయక సంఘాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం 4వ విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. మహిళల ఖాతాలకు నగదును జమ చేశారు. జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్‌ షన్మోహన్‌, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, జెడ్పి వైస్‌ ఛైర్మన్‌ ధనుంజయరెడ్డి, మేయర్‌ అముద, లీడ్‌ బ్యాంకు మేనేజరు హరీష్‌, డీఆర్‌డీఏ పీడీ తులసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. కలెక్టర్‌ జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ 33,655 గ్రూపులకు చెందిన 3,10,643మంది మహిళలకు రూ.324కోట్లు జమౌతుందన్నారు.

➡️