ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్‌ కృషి

Jan 1,2024 21:34
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్‌ కృషి

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: రఉపాధ్యాయ సమస్యలపై పోరాడేది యుటిఎఫ్‌ సంఘం అని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సరిత అన్నారు. సోమవారం మండల విద్యా వనరుల కేంద్రంలో యూటీఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మండల అధ్యక్షులు మొగిలయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యుటిఎఫ్‌ సంఘం బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం యుటిఎఫ్‌ డైరీలు, క్యాలెండర్లను ఎంఈఓలు నాగేశ్వరరావు, రమేష్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోహన్‌ రెడ్డి, కోశాధికారి మహేష్‌, రమేష్‌, చెంగ య్య, బుగ్గయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️