ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతి తీరని లోటు

Dec 15,2023 22:43
ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతి తీరని లోటు

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: రోడ్డు ప్రమాదంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు తీరని లోటని కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ఎంఎల్‌సి సాబ్జికి నివాళ్ళు అర్పించారు. సెమ్మెలో ఉన్న అంగన్వా డీలు, కలెక్టరేట్‌ ఎదుట ఫోరాటం చేస్తున్న ఆశాలు షెక్‌ సాబ్జికి నివాళ్ళు అర్పించారు. వికోట మండ లంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జివి. రమణ, ఐరాల మండలంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్‌నాయుడు పలువురు యు టిఎఫ్‌ నేత లు, ఉపాధ్యాయులు సాబ్జి చిత్ర పటా నికి నివాళ్ళు అర్పించారు. ఉద్యమ నేతగా శాసన మండలికి ఎన్నికైన షెక్‌ జాబ్జి ఉపాధ్యాయ ఉద్య మం కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నారని ఆ యన మృతి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక వర్గానికి తీరని లోటని యుటిఎఫ్‌ నేతలు తెలిపారు.

➡️