ఎస్పీకి ఘనంగా వీడ్కోలు ఎస్పీకి వీడ్కోలు పలుకుతున్న చిత్తూరు జిల్లా పోలీస్‌ సిబ్బంది

ఎస్పీకి ఘనంగా వీడ్కోలు ఎస్పీకి వీడ్కోలు పలుకుతున్న చిత్తూరు జిల్లా పోలీస్‌ సిబ్బంది

ఎస్పీకి ఘనంగా వీడ్కోలు ఎస్పీకి వీడ్కోలు పలుకుతున్న చిత్తూరు జిల్లా పోలీస్‌ సిబ్బందిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సాధారణ బదిలీలలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి బదిలీ అయిన సందర్భంగా జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వు పెరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీకి ఫెరెడ్‌ వీడ్కోలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న ఎస్పీని ఆర్మ్డ్‌ రిజర్వు పోలీసు అధికారులు పెరేడ్‌ వీడ్కోలు నిర్వహించి ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పోలీసు కవాతు వాహనంలో పోలీస్‌ ఆఫీస్‌ నుండి గాంధీ కూడలిపై పూలు చల్లుతూ కవాతు వాహనాన్ని జిల్లా అధికారులు అందరు లాగుతూ ఎస్పీని ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఏఆర్‌ అడిషనల్‌ ఎస్‌పి జి.నాగేశ్వర రావు మాట్లాడుతూ ఎస్‌పి మంచి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం గల అధికారి అని ఆయన కింద పనిచేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనలో సహాయసహకారాలు అందించిన జిల్లా అధికారులకు హదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ ఎస్‌ఇబి శ్రీలక్ష్మి, ఎఆర్‌ అడిషనల్‌ ఎస్పీ జి.నాగేశ్వర రావు, డిఎస్పీలు శ్రీనివాస మూర్తి, శ్రీనివాసరెడ్డి, బాబుప్రసాద్‌, విష్ణు రఘువీర్‌, శ్రావణ్‌ కుమార్‌, ఎఆర్‌ డిఎస్పీ మురళిధర్‌, ఇలియాస్‌ బాష, ట్రైనీ డిఎస్పీ పావన కుమార్‌, జిల్లా ఇన్స్పెక్టర్‌లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️