ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

Dec 15,2023 22:47
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

రామకుప్పంలో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ వీఆర్‌వో ఆనంద్‌ రూ.25వేలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు లంచం అడిగితే ఫోన్‌ చేయాలని ఏసీబీ విజ్ఞప్తిప్రజాశక్తి-రామకుప్పం: రైతు పాసు పుస్తకంలో తప్పులు సరిచెసెం దుకు లంచం తీసకుంటుండగా రామకుప్పం మండల పరిధిలోని బందర్లపల్లి విఆర్‌ఓ ఆనంద్‌ను శుక్రవారం తిరుపతి ఏసిబి అధికా రులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఏసీబీ అడిషనల్‌ డి.ఎస్‌.పి దేవప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. నక్కబాలేపల్లికి చెందిన మునిరత్నం, రవికుమార్‌, జశ్వంత్‌ అన్నదమ్ములు. వీరి తల్లి ఏడేళ్ల క్రితం మరణించడంతో అమే పెరునవున్న 3.14ఎకరాల డీకేటి భూమిని అన్న దమ్ములు పంచుకున్నారు. అయితే ముగ్గురి పాసుప ుస్తకాలలో తప్పులు రావటంతో మునిరత్నం విఆర్‌ఓ ఆనంద్‌ను కలిసి తన సమస్యను తెలిపాడు. అయితే పాసుపుస్తకాలు కరెక్షన్‌ చేసేందుకు రూ.35 వేలు ఇవ్వాలని విఆర్‌ఓ డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.25వేలు ఇస్తానన్న మునిరత్నం లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసిబి అధికారులను ఆశ్రయి ంచాడు. రాజుపేట వద్ద రైతు ముని రత్నం నుండి విఅర్‌ఓ ఆనంద్‌ లంచం రూ.25వేలు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వీఆర్‌వోను పట్టుకున్నారు. అనంతరం రామకుప్పం మండల రెవె న్యూ కార్యా లయంకు చేరుకొని పలు రి కార్డులను పరిశీలించారు. సిబ్బందిని ఆరా తీశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉదోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే 144 00 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించలని ఏసిబి అడిషనల్‌ డిఎస్‌పి దేవప్రసాద్‌ చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలను కోరారు. ఆయన వెంట ఏసీబీ సిబ్బంది ఈశ్వర్‌, నవీన్‌, వెంకటనారాయణ, సూర్య నారాయణ తదితరులు ఉన్నారు.

➡️