క్రీడాకారులకు బహుమతులు ప్రదానం

Jan 30,2024 22:15
క్రీడాకారులకు బహుమతులు ప్రదానం

ప్రజాశక్తి-పెద్దపంజాణి: పలమనేరు నియోజకవర్గ స్థాయిలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలమనేరు ఎంపీడీవో విద్యాసాగర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించడానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయన్నారు. క్రీడాకారులందరూ ఈ పోటీల్లో క్రీడా స్ఫూర్తితో మసలుకోవాలని సూచించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, ఖోఖో, క్రికెట్‌ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. కార్యక్రమంలో పలమనేరు మున్సిపల్‌ ఛైర్మన్‌ చాముండేశ్వరి సుధా, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు ప్రహల్లాద, పలమనేరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, కోగిలేరు, అమ్మరాజుపల్లి సర్పంచులు రమేష్‌ బాబు, స్వర్ణమ్మ, ఉపాధ్యాయులు సురేష్‌బాబు, శశిప్రకాష్‌, నూరుద్దీన్‌, అజీమ్‌, తులసీరామ్‌, అన్నదొరై పాల్గొన్నారు.

➡️