ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 20,2023 22:25

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాలను నగర పాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. బుధవారం ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహణపై వార్డు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల నిర్వహణను సంబంధించి వార్డుస్థాయిలో ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. వార్డుస్థాయిలో జట్లకు సరిపోయేలా క్రీడాకారుల ఎంపిక పూర్తి చేయాలని, ఎంపిక చేసిన క్రీడామైదానాల్లో క్రీడల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మైదానాల్లో ఏర్పాట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ.. ఎక్కడా లోపాలు లేకుండా చూడాలన్నారు. క్రీడల నిర్వాహణకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. సీఎంఎం గోపి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️