న్యాయం చేయండిమీడియాను ఆశ్రయించిన రైతు

Feb 14,2024 21:24
న్యాయం చేయండిమీడియాను ఆశ్రయించిన రైతు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తనకు న్యాయం చేయాలని చిత్తూరు రూరల్‌ మండలం పెరుమాళ్ళు కండ్రిగకు చెందిన రైతు శ్రీనివాసులు బుధవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పొలంలో వ్యవసాయం చేసేందుకు పైపులైన్‌ ఏర్పాటు చేసుకుంటే సమీప పొలం రైతు ఈశ్వర్‌ నాయుడు దౌర్జన్యం చేస్తూ పైపు లోను తవ్వి నాశనం చేశాడని, ఈ విషయం రెవెన్యూ, జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోయినా తనకు న్యాయం జరగలేదన్నారు. తనపై దౌర్జన్యం చేయడంతో పాటు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికార్లు కల్పించుకొని న్యాయం చేయాలని వేడుకున్నాడు.

➡️