పాడి రైతుల కడుపు కొడుతున్నారు

Dec 15,2023 22:45
పాడి రైతుల కడుపు కొడుతున్నారు

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు రామచంద్రయాదవ్‌ ఇల్లు దిగ్బంధంప్రజాశక్తి – పుంగనూరు ‘పుంగనూరులో నియంత పాలన సాగు తోందని, పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, పాల రైతుల కడుపు కొడుతున్నారు’ అని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్‌ మండిపడ్డారు. సదుం మండల కేంద్రంలో చేపట్టిన రైతుభేరి కార్యక్రమం జరగనీకుండా శుక్ర వారం రామచంద్రయాదవ్‌ ఇంటిని పోలీసులు దిగ్బ ంధించారు. ఎల్‌ఐసి కాలనీకి వెళ్లే రహదారులన్నీ పోలీసులు మూసివేశారు. ఆ వీధిలోకి ఎవరు వెళ్లా లన్నా అడ్రస్సు ప్రూఫ్‌ చూపించాలని నిర్బంధం విధిం చారు. రామచంద్రయాదవ్‌ సతీమణి శుక్రవారం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వాహనాన్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వివా దం తరువాత వాహనాన్ని లోనికి అనుమతించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుభేరి కార్యక్రమానికి సిద్ధమై బయలుదేరుతుం డగా ఒకటిన్నర గంట ముందు సభకు అనుమతి లేవంటూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజ సమన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పనిచేస్తు న్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ మంత్రి కోసమే ఉన్నాయని, పేద ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించా రు. ఒక వ్యక్తి లబ్ధి కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తు ందని స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు. తాము రైతు భేరి పెడితే ఎక్కడ ఆయన తప్పులు ఎత్తి చూపుతామోనని భయపడి వ్యవస్థను అడ్డు పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎస్పీ రిశాంత్‌ రెడ్డి పెద్దిరెడ్డికి పూర్తి సహకారం అందిస్తూ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో సభను జరగనివ్వకుండా అడ్డుకోవడం చూస్తే ఆయన నైతికంగా ఓటమి చెందినట్టు ఒప్పుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి పాల డెయిరీ రైతుల పొట్ట కొట్టి వారి రక్తం తాగుతున్నారని చెప్పారు .ఒక రోజుకి 40 వేలు లీటర్ల పాలు డెయిరీకి తీసుకెళ్తూ ఒక లీటరుకు పది రూపాయలు పైన రైతులు వద్ద నుండి దోచుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలో రైతాంగ సమస్యలపై బీసీవైపి పోరాటం చేస్తుందని వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు .ప్రశాంతంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ దష్టికి తీసుకెళ్తామన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సభ లు ,సమావేశాలు పెట్టాలన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అడ్డుకోవడంపై గవర్నర్కు, మానవ హక్కులకు ,కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

➡️