పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Dec 25,2023 23:04
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు రూరల్‌ మండలంలోని నరసింగరాయనిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గురువులతో విద్యార్థులు సిల్వర్‌ జూబ్లీ అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనంలో 1995-1996 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు, మంచి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను బోధించిన 15 మంది గురువులు మా ఉన్నతికి ఎదుగుదలకు ఎంతో కషి చేశారని మేము ఇప్పుడు ఎంతో ఉన్నతమైన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి గౌరవప్రదమైనటువంటి జీవన విధానంలో కొనసాగుతున్నామని అందుకు కతజ్ఞతగా ఆదివారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నరసింగరాయన పేట ఆవరణంలో ఉదయం 10 గంటల నుండి చక్కటి విందు భోజనం, ఆటల పాటలు, ఉపన్యాసాలు, అనుభవాలతో సాయంత్రం 5 గంటల వరకు సిల్వర్‌ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా తప్తిగా ఉందని అందుకు గురువులను వస్త్రములు, శాలువాలు, జ్ఞాపికలు, చందనమాలలు, మహారాజా కిరీటాలు, స్వీట్‌ బాక్సులు, డ్రై ఫ్రూట్‌ బాక్సులుతో ఘనంగా సత్కరించుకోవడం మా అదష్టంగా భావిస్తున్నాము. ఆనాటి అల్లరులను తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అదే విధంగా కీర్తిశేషులైన ముగ్గురు గురువులు, సాటి విద్యార్థులు, సిబ్బంది ఐదు మందికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పూర్వ గురువులు అయిన ప్రధానోపాధ్యాయులు చిన్న స్వామి నాయుడు, ఉపాధ్యాయులు ఉమాపతి నాయుడు, సుబ్రమనీ నాయు డు, దినకర్‌ నాయుడు, భాస్కర్‌ నాయుడు, శ్రీమతి సరోజినీ, శ్రీమతి అమత వల్లి, కష్ణమ నాయుడు, దామోదరన్‌, శ్రీమతి సుభాషిణి, హరిదాసు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రమేష్‌ , ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పాల్గొన్నారు.

➡️