పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Dec 14,2023 22:45
పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ అవుట్‌ పోస్టును జిల్లా ఎస్పీ వై.రిషాంత్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడ త్వరలోనే పోలీస్‌ అవుట్‌ పోస్టు సేవలను ప్రారంభిస్తామని విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ఎల్లప్పుడు రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించామని తెలియజేశారు. భవన నిర్మాణానికి కషి చేసిన అధికారులు, సిబ్బందిని శాలువలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. పోలీస్‌వెల్ఫేర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ అవుట్‌ పోస్టు నిర్మాణానికి ప్రత్యేకశ్రద్ధ చూపిన ఆర్‌ఐ ఎంటిఓ మధుని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎస్‌ఐబి శ్రీలక్ష్మీ, అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ జి.నాగేశ్వరరావు, పట్టణ డీఎఈస్ప శ్రీనివాసమూర్తి, దిశ డిఎస్పీ జె.బాబుప్రసాద్‌, ట్రాఫిక్‌ డిఎస్పీ విష్ణు రఘువీర్‌, ఏఆర్‌డి ఎస్పీ మురళీధర్‌, ఒకటవ పట్టణ ఇన్ప్సెక్టర్‌ విశ్వనాథ్‌రెడ్డి, ఈస్ట్‌ ఇన్స్పెక్టర్‌ గంగిరెడ్డి, టిడిసి ఇన్స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ నిత్యబాబు, క్రైమ్‌ ఇన్స్ప్‌క్టర్‌ భాస్కర్‌, కమాండ్‌ కంట్రోల్‌ ఇన్స్పెక్టర్‌ సురేంద్ర నాయుడు, ఆర్‌ఐ అడ్మిన్‌ నీలకంటేశ్వరరెడ్డి, ఆర్‌ఐఎంటిఓ మధు, రెండవ పట్టణ ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️