పోలీస్ స్పందనకు 31 ఫిర్యాదులుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్. సుధాకర్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మీ ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో 31 ఫిర్యాదులు అందగా తక్షణమే విడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులకు పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.