భూ ఆక్రమణ ప్రశ్నిస్తే.. సర్పంచ్‌ భర్త దాదాగిరి.! శ్రీ చిన్న గొల్లపల్లి గ్రామస్తుల ఆరోపణ శ్రీ టీడీపీ, జనసేన నేతలను వెంటబెట్టుకొని తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడి శ్రీ 6ఎకరాల పశువుల మేత భూమిని కబ్జా చేశారంటూ మండిపాటు శ్రీ రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీత శ్రీ ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

భూ ఆక్రమణ ప్రశ్నిస్తే.. సర్పంచ్‌ భర్త దాదాగిరి.! శ్రీ చిన్న గొల్లపల్లి గ్రామస్తుల ఆరోపణ శ్రీ టీడీపీ, జనసేన నేతలను వెంటబెట్టుకొని తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడి శ్రీ 6ఎకరాల పశువుల మేత భూమిని కబ్జా చేశారంటూ మండిపాటు శ్రీ రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీత శ్రీ ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

భూ ఆక్రమణ ప్రశ్నిస్తే.. సర్పంచ్‌ భర్త దాదాగిరి.! శ్రీ చిన్న గొల్లపల్లి గ్రామస్తుల ఆరోపణ శ్రీ టీడీపీ, జనసేన నేతలను వెంటబెట్టుకొని తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడి శ్రీ 6ఎకరాల పశువుల మేత భూమిని కబ్జా చేశారంటూ మండిపాటు శ్రీ రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీత శ్రీ ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరికప్రజాశక్తి-గుడుపల్లి: ఆరు ఎకరాల ప్రభుత్వ పశువులు మేత బీడు భూమిని అక్కడి సర్పంచ్‌ భర్త ఆక్రమించుకున్నాడు. ఇందేంటని ప్రశ్నించిన స్థానికులపై దాదాగిరి చేశారు. చేసేది లేక అధికారులను ఆశ్రయిస్తే అధికార పార్టీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్తులు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన నేతలను వెంటబెట్టుకొని సోమవారం తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే.. మండలంలోని పెద్దగొల్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని చిన్న గొల్లపల్లి పంచాయతీలోని సర్వే నెంబర్‌ 1.1లో సుమారు 6 ఏకరాల ప్రభుత్వ పశువుల బీడు భూమిని సర్పంచ్‌ రుక్మిణీ, ఆనంద్‌ కబ్జాచేశారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం టీడీపీ, జనసేన నాయకులను వెంటబెటుకొని తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండేళ్లుగా భూ ఆక్రమణపై అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. రెవెన్యూ అధికారుల పూర్తి సహకారంతోనే సర్పంచ్‌, భర్త భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్న భూమిని ఆక్రమించుకున్న సర్పంచ్‌ భర్తను ప్రశ్నిస్తే ”ప్రభుత్వం మాది చేతనైంది చేసుకోండి” అంటూ దాదాగిరి చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు గ్రామస్తులు, ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అధికారులు ఒకింత ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆఖరికి సానుకూలంగా గ్రామస్తులు, నేతలకు మాట్లాడి భూ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. రెండు రోజుల్లో చర్యలు లేకుండా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టి.ఎం బాబునాయుడు, చంద్రశేఖర్‌, బేటప్పనాయుడు, హేమాంబ గౌడు, సుబ్రమణి, నరేష్‌, అమీర్‌, గణేష్‌, సర్పంచ్‌ నారాయణ, విజరుకుమార్‌, రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️