భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Dec 20,2023 22:29

చిత్తూరుఅర్బన్‌: ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు బార్‌ అసోషియేషన్‌ నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం స్థానిక పాత కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. చిత్తూరు కోర్టు ముందు న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. అసోషియేషన్‌ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️