రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు టిడిపి నాయకులు చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహంప్

రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు టిడిపి నాయకులు చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహంప్

రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు టిడిపి నాయకులు చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహంప్రజాశక్తి -పుంగనూరు: వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులు చేసి అభివద్ధి లేకపోయినా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు. పుంగనూరు మున్సిపాలిటీలో వార్డుబాట కార్యక్రమాన్ని ఆదివారం హనుమంతురారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. అటు రాష్ట్రంలో కానీ ఇటు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కక్ష సాధింపులు కేసులు పెట్టడం, జైలుకు పంపించడం కార్యక్రమాలు తప్పితే మరి ఎలాంటి అభివద్ధి లేదని అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో అయితే పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఇలాంటి దౌర్జన్యాలు ఎప్పుడు చూసి ఉండరన్నారు. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరు మూడు పర్యాయాలు అధికారాన్ని ఇచ్చి చూశారని ఇకనైనా చేసిన అరాచకాన్ని అందరూ గమనిం చారని మంచికి, అభివద్ధి చేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. అన్ని వార్డులు తిరిగి ప్రజలను కలిసి టిడిపి గెలుపునకు సహకరించాలని కోరుతానన్నారు. ఈ సందర్భంగా హనుమంతురాయి బీడీ కాలనీ, ప్రకాశం కాలనీ, రామ్‌ నగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. టిడిపి చేపట్టిన వార్డుబాట కార్యక్రమానికి జనసేన నాయకులు మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేశాధి ప్రకాష్‌, శ్రీకాంత్‌, రాజంపేట పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి కుమార్‌, సివి రెడ్డి, పోలీస్‌ గిరి, మాధవ రెడ్డి, న్యాయవాది వెంకటముని, సుహేర్‌ బాష, సద్దాం, సుధాకర్‌ పాల్గొన్నారు. వైసీపీ నుండి టిడిపిలో చేరిక వైసిపి నుండి టిడిపిలోకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. వార్డు బాట కార్యక్రమం సందర్భంగా హనుమంతరావు 10 కుటుంబాలకు చెందిన వైసిపి వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోసం తమ వంతు కషి చేస్తామని వారు తెలిపారు.

➡️