‘రా కదలి రా’ సభాస్థలికి భూమిపూజ

Feb 1,2024 21:10
'రా కదలి రా' సభాస్థలికి భూమిపూజ

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తలపెట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం ఈ నెల 6న గంగాధరనెల్లూరులో నిర్వహించనున్నారు. ఈ మేరకు మండలంలోని రామానాయుడుపల్లి వద్ద సభా ప్రాంగణం నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. గురువారం మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తినాని, నేతలు డాక్టర్‌ థామస్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, డాక్టర్‌ మురళీమోహన్‌, గాలి భానుప్రకాష్‌, చిట్టిబాబునాయుడు, చంద్రప్రకాష్‌ సభస్థలానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వామిదాస్‌, కష్ణమనాయుడు, శ్రీధర్‌యాదవ్‌, దేవసుందరం, వెంకటేష్‌, నియాజ్‌ అలీ, రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️