కిలో రూ.50కే టమాటా

Jun 26,2024 15:20 #East Godavari

– ఇన్చార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భరత్
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజారు లో సబ్సిడీ ద్వారా టమోటా అమ్మకాలని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, కూరగాయల ధరలు పెరగడం పై రెండు రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, కూరగాయల ధరలు నియంత్రణ పై చర్చించడం జరిగిందన్నారు. టమోటా కిలో రూ.70 లు, ఉల్లిపాయలు కిలో 40 లకు చేరిన ధరలను నియంత్రణ పై మార్క్ఫెడ్, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  అందులో భాగంగా “పుంగనూరు” నుంచి ఐదు మెట్రిక్ టన్నుల టమాటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. గ్రేడ్ వన్ రకం టమాటా కేజీ ఒక్కంటికి రూ.50 లు చొప్పున ప్రతీ కుటుంబానికి రెండు కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియ చేశారు.

జిల్లాలోని ఆరు రైతు బజారు ల ద్వారా సబ్సిడీ ద్వారా నాణ్యమైన గ్రేడ్ వన్ టమోటా అమ్మకాలు జరుపుతున్నట్లు, నగరంలోని ఐదు, కొవ్వూరు లోని ఒక రైతు బజారు లో సబ్సిడీ టమోటాలను వినియోగదారు లకి అందుబాటు లోకి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ప్రతి రెండూ రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి సరఫరా చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ఆమేరకు సరుకును తీసుకుని రానున్నట్లు తెలిపారు. తద్వారా లభ్యత పెరగడం వలన రానున్న రోజుల్లో ధరలను నియంత్రణ చెయ్యడం సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగు ఏ డీ ఎమ్. సునీల్ కుమార్, రైతు బజారు ఎస్టేట్ అధికారులు, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు

➡️