వేతనాలు పెంచాలని ‘ఆశా’.. ప్రభుత్వానికి పట్టదా ఘోష

Dec 15,2023 22:50
వేతనాలు పెంచాలని 'ఆశా'.. ప్రభుత్వానికి పట్టదా ఘోష

రెండవ రోజూ కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరసన
సర్కార్‌ దిగిరావాలంటూ ‘ఆశా’ల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఆశాల ఘోష ప్రభుత్వానికి వినిపించడం లేదా… ఇచ్చిన హామీలను నెరవేచ్చాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం వినిపించుకోవడం లేదంటూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు గంగా, కృష్ణవేణి, పద్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాల సమస్యలపై కలెక్టరేట్‌ ఎదుట గురు, శుక్రవారాల్లో 36 గంటల పాటు నిరసన దీక్షలు నిర్వహించారు. రెండో రోజైన శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుటే వంటవార్పుతో నిరసన తెలిపారు. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఆశాలకు ప్రభుత్వం ఇచ్చే పారితోషకం ఏపాటిదో ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు పెంచేస్తున్నం అని ప్రకటిస్తేసరిపోతుందా జీవోలు ఇచ్చిన అమలుకు నోచుకోవడంలేదన్నారు. కరోనా కాలంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సేవలు చేస్తే ఆశాలకు ఇచ్చే గౌరవం ఇదే అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చే జీతంలో సగం టిఏ, డిఏలకే సరిపోతోందని పైగా సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ అనర్హులుగా ప్రటించడం ఏమిటని మండిపడ్డారు. వైద్య రంగంలో మార్పులంటే కష్టపడి పని చేసే ఆశాలకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశాల ఆందోళనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్‌ సంపూర్ణ మద్దతు ప్రటించారు. ఆశాల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశాల ఫోరాటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, ఉపాధ్యాక్షులు వాడ గంగరాజు, టిడిపి నాయకులు సప్తగిరి ప్రసాద్‌, మోహన్‌రాజులు మద్దతు తెలిపారు.

➡️