వైసీపీది అరాచక ప్రభుత్వం : మాజీ మంత్రి

Jan 23,2024 17:25

ప్రజాశక్తి-వికోట: అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికోటలో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యాక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారై ప్రసంగించారు. వైసీపీని ప్రజలు తరిమి కొట్టేందుకు రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన ఓటమిని ముందే ఊహించి అభ్యర్థులను బదిలీ చేసి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారంటూ ఆరోపించారు. బీసీ వర్గాలకు టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని విధాల ఆదుకుంటామని, బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ కూడా టీడీపీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అంతకు ముందు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రనాయుడు, రంగనాథ్‌, నాగభూషణం, రాంబాబు, ఈశ్వర్‌గౌడ్‌, చౌడప్ప, సోమశేఖర్‌, గోపినాథ్‌, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️