సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో.. స్తంభించిన విద్యావ్యవస్థ

Dec 22,2023 23:17
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో.. స్తంభించిన విద్యావ్యవస్థ

ప్రజాశక్తి – పుంగనూరు: విద్యావ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ గత మూడు రోజులుగా సమ్మెబాట పట్టడంతో ఎక్కడెక్కడ విద్యా కార్యక్రమాలు అన్నీ స్తంభించాయి. నాడు నేడు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ కార్యక్రమాలు నిలిచిపోయాయి. బైజూస్‌ ట్యాబ్‌ ఈ పాఠాలు అన్ని నిలిచిపోయాయి. ముఖ్యమంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసిన ట్యాబులు కూడా రాష్ట్రవ్యాప్తంగా సక్రమంగా సరఫరా కాలేదు. వీరు లేని కారణంగా బైజుస్‌ ట్యాబ్‌ నందు విద్యా కార్యక్రమాలు అప్లోడ్‌ చేసే పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి బై జూస్‌ కంటెంట్‌ పూర్తిగా నిలిచిపోయినది. అలాగే ఇంటర్‌ ఆక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్‌ ఐఎఫ్బి విద్యా కార్యక్రమాలు పూర్తిగా పంపించడం జరిగింది. నెలలో చివరి పని దినాలు కావున జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజనం సంబంధించిన కార్యక్రమాలు ,ఆయాల జీతాలు ,మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు మండల స్థాయిలో కంప్యూటర్‌ నందు అప్లోడ్‌ చేయవలెను ఇవి చేయకపోతే వారి నెలల జీతాలు కూడా పడే పరిస్థితులు కనబడడం లేదు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యము, చిక్కిలు, కోడిగుడ్లు తదితర పూర్తి వివరాలు కూడా లేక సరఫరా కావని తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి సైన్స్‌ డే కార్యక్రమాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతున్నది. మండల విద్యాశాఖ కార్యాలయాలు తెరుచుకోక మెసెంజర్‌ లేక అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో మండల విద్యాశాఖాధికారులు చెప్పుకోలేక దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే సహిత విద్య కార్యాలయంలో ఐ.ఆర్‌.సిలుగా పనిచేస్తున్న టీచర్లు సమ్మెబాట పట్టడంతో మానసిక వైకల్యం కలిగిన పిల్లలను పూర్తిగా ప్రభుత్వం స్తంభింపజేసింది . గ్రామస్థాయిలో పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయికి పంపడానికి సిఆర్పిలు, మండల కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితరులు లేకపోవడంతో డేటా మొత్తం పూర్తిగా నిలిచిపోయింది .దీనితో రాష్ట్ర అధికారులపై కేంద్ర విద్యా శాఖ వర్గాలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్రస్థాయిలో ఫ్యాప్టో, కార్మిక సంఘాలు సిఐటియు ,ఏఐటీయూసి ,సిపిఎం ,సిపిఐ ,యుటిఎఫ్‌ ,ఎస్‌ టి యు, ఏపీ టిఎఫ్‌, 18 ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్రస్థాయి నుంచి వీరికి అండగా నిలవడం చర్చనీయాంశం. చిరు ఉద్యోగులైన వీరి బాధలో పట్టించుకోక కనీసం చర్చలకు కూడా పిలవక పోవడం ప్రభుత్వ స్థితి ఏంటని మేధావులు ఆలోచిస్తున్నారు. సమగ్ర శిక్ష కార్యక్రమాలు చేయడానికి విద్యా శాఖ వర్గాలను పంపుతున్నట్లు ప్రభుత్వం చెప్పిన ఉపాధ్యాయ సంఘాలు ఎవరూ అంగీకరించలేదు. అలాగే వీరి కోసం ఉపాధ్యాయ సంఘాలు అందరూ ప్రత్యక్ష సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ,ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఏకతాటపైకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించిన వర్గాలు నిశితంగా పరిశీలించి రాష్ట్రానికి రావలసిన వాటా పై కూడా దెబ్బ పడుతుందని నిపుణులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన మౌలిక వసతుల నిధులు కూడా రావాలంటే యుడైస్‌ కార్యక్రమాలు కేంద్రానికి సమర్పించవలసి ఉంది. ఇవి కూడా పూర్తిగా స్తంభించడంతో భవిష్యత్‌ విద్యా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతాయో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి వీరితో చర్చలు జరిపి విద్యా కార్యక్రమాలు సాఫీగా జరగడానికి సహకరించాలని కోరుతున్నారు . వీరి ప్రధాన డిమాండ్స్‌… ఉద్యోగ భద్రత కల్పించాలి, గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు, రవాణా బత్యం ఇంటి అద్దె చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతున్నారు.మోకాళ్లపై నిరసనచిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం కి మూడో రోజుకు చేరింది. చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తూ అనంతరం వారిని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సెలవులు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్ట్‌ టైం పేరు తోఫుల్‌ టైం చేపించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేంద్రన్‌, సర్వ శిక్ష అభియాన్‌ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, వేలాయుధం తదితరులు పాల్గొన్నారు.

➡️