సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి : సిఐటియు

Feb 19,2024 22:01
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి : సిఐటియు

ప్రజాశక్తి – క్యాంపస్‌ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.జయచంద్ర డిమాండ్‌ చేశారు. ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి నాలుగో రోజుకు చేరింది. జయచంద్ర మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి రాకేష్‌, నాయకులు సుబ్బు, రేవతి, చంద్రమ్మ అనురాధ, మునిలక్ష్మి, రమా, మురళి, తదితరులు పాల్గొన్నారు.

➡️