టూరిజం కారిడార్గా కార్వేటినగరం

Feb 29,2024 13:04 #Chittoor District

 రాణీ మహల్కు ఆధునిక ఆందాలు
 డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ప్రజాశక్తి-కార్వేటినగరం : సంస్థానాధీశులు నిర్మాణం చేపట్టిన చారిత్రక కట్టడాలను పూర్వ వైభవం తీసుకొచ్చి కార్వేటినగరాన్ని టూరిజం కారిడార్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గత 9వందల సంవత్సరాల క్రితం కార్వేటినగరం సంస్థానాధీశులు నిర్మాణం చేపట్టిన భవనాలకు గొప్పచరిత్ర ఉందన్నారు. అయితే గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో శిథిలావస్థకు చేరుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక స్థానిక ఎంపీపీ లతబాలాజీ,సర్పంచ్ ధనంజయవర్మ శిధిలావస్థకు చేరుకున్న రాణిమహల్కు పూర్వ వైభవం తీసుకు రావాలని, కార్వేటినగరం చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలని పట్టుపట్టడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి ఆర్కాలజిస్టువారికి స్వాధీనం చేయడంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీఇచ్చారన్నారు. సంస్థానాధీశులు నిర్మాణం చేపట్టిన ఈ భవనాన్ని ఆనాటి రాజులు ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతో సుమారు 75 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలుగా వినియోగించుకున్నారని తెలిపారు. నేను ఈ మండలానికి చెందిన వాడను సంస్థానాధీశుల కాలం నాటి భవనాలకు పూర్వవైభవం తీసుకొచ్చి నా రుణం తీర్చుకుంటానని అన్నారు. అదే సంస్థానాధీశులు నిర్మాణం చేపట్టిన వేణుగోపాలస్వామి ఆలయం, స్కంధపుష్కరిణీ తో పాటు నియోజకవర్గంలోని ఆళత్తూరులో వెలసి ఉన్న పరద వెంకటేశ్వస్వామి కొటార్వేడు గ్రామంలో వెలసి ఉన్న అగస్థీశ్వరస్వామి ఆలయం, పెనుమూరులో కనిగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం, పాలసముద్రం మండలంలో మఠవలంలో వెలసి ఉన్న గోవర్ధనేశ్వరస్వామి ఆలయాలను టూరిజంలో ఆలయాల దర్శనార్థం బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీంతో గ్రామం అభివృద్ధే కాకుండా రాజుల ఆకాంక్షను నెరవేర్చినట్టవుతుందన్నారు. రాణీమహల్ ను ఆధునీకరణకు సహకరించిన మంత్రులు కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథిన్రెడ్డి.ఆర్కేరోజా, రాష్ట్ర విద్యా కార్యాదర్శి ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్లకు కృతజ్ఞనతలు తెలిపారు.
 త్వరిత గతిని పూర్తి చేస్తాం
సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవతో చేపట్టనున్న రాజీ మహల్ ఆధునీకరణ పనులను నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తి చేస్తానని టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ అన్నారు. రాజీ మహల్ను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆధునీకరణకు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని, మార్చీ మొదటి వారంలో భవనం ఆధునీకరణకు భూమి పూజ చేబట్టడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణం అనంతరం రాణీమహల్ మ్యూజియంగా మార్చి నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో భాగంగా కార్వేటినగరం చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న సీఎం జగనన్నకు, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి గ్రామస్తులు కృతజ్ఞలు తెలిపారు. అలాగే ఎంపీపీ లతబాలాజీ, సర్పంచ్ ధనంజయవర్మ స్థానిక నాయకులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ ను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్కాలజిస్టు అడ్మినిస్ట్రేషన్ అధికారి అపర్ణ, డీఈ శ్రీనివాసులు, ఏడీ పవన్కుమార్. ఎంఈవోలు విజయకుమార్, మనోజ్కుమార్, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ విజయులురెడ్డి, హెచ్ఎం కోటేశ్వర్రావు, శేషాద్రి, పలువురు పాల్గొన్నారు.

➡️