పంట పొలాలపై ఏనుగు దాడి 

Feb 5,2024 11:06 #Chittoor District
elephant attack on paddy crop

అరటి, వరి పైరుకు నష్టం 

ప్రజాశక్తి – సోమల : మండల కేంద్రమైన సోమల పంచాయతీకి చెందిన చెన్నయ్య గారి పల్లె గ్రామ సమీపంలోని పంట పొలాలపై ఒంటరి ఏనుగు దాడి చేసి అరటి మొక్కలను వరి పైరును నష్టం కలిగించినట్లు రైతులు తెలిపారు. సోమశేఖర్, భాస్కర, రెడ్డప్ప రైతులకు చెందిన వరి పైరుపై ఒంటరి ఏనుగు నడుచుకుంటూ వెళ్లడంతో ఎనిమిది రోజుల క్రితం నాటిన పైరు ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి మొలకలు కూడా విరిచి వేసి నష్టం కలిగించినట్టు రైతులు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల వరకు పొలాల వద్ద ఉన్న తాము ఆ తర్వాత ఇండ్లకు వెళ్ళామని అటుపిమ్మట ఒంటరి ఏనుగు పొలాలపై దాడి చేసి వెళ్లినట్టుగా రైతులు అంటున్నారు.

➡️