మెరుగైన వైద్యసేవలందించాలి – కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌

ప్రజాశక్తి- కడప అర్బన్‌ రోగులకు ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని వెంటనే ఐసియుకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు, సిబ్బందికి కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. శనివారం రిమ్స్‌ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డు, ఎంఐసియును వైద్య సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. సాధారణ జ్వరం, రక్త పరీక్షలు వంటి వాటి కోసం నగరంలో ఉన్న బి13 యుపిహెచ్‌సి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించు కోవాలని తెలిపారు. ఎమర్జెన్సీ కేసులను వెంటనే ఐసియుకి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూత నంగా ఏర్పాటు వచ్చిన అల్ట్రాసౌండ్‌ మిషనరీని ఎమర్జెన్సీ వార్డులో ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అక్కడ సిబ్బందికి సూచించారు. ఎంఐసియులో ఉన్నటువంటి రోగుల ఆరోగ్యం మామూలు స్థితికి రాగానే వారిని వెంటనే వార్డుకు షిఫ్ట్‌ చేయాలని పేర్కొన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలని అక్కడ సిబ్బందికి సూచించారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి ఆలస్యత్వం చేయకుండా తగిన సమయంలో వారికి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు.

➡️