ఎమ్మెల్యే గణబాబుకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్యే గణబాబుకు అభినందనల వెల్లువ

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయ దుందుభి మోగించి, హ్యాట్రిక్‌ విజయాల సాధించిన విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే పి.గణబాబును కాకానినగర్‌ శ్రీదత్త ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ నివాసితులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అసోసియేషన్‌ మాజీ సెక్రటరీ లలితకుమారి, బోర్డు మెంబర్‌ సంధ్యారాణి, శ్రీ చైతన్య విద్యానికేతన్‌ ప్రిన్సిపల్‌ అనంతలక్ష్మి, మహిళామండలి సభ్యులు మేరీ, సునీత తదితరులు ఎమ్మెల్యే గణబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

గణబాబుకు కళా సేవాపీఠం అభినందన

గోపాలపట్నం :విశాఖ పశ్చిమ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న పి.గణబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం గోపాలపట్నం కళాసేవా పీఠం సభ్యులు పుష్పగుచ్ఛాలను అందజేసి, విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు నందవరపు సోములు మాట్లాడుతూ ఎమ్మెల్యే గణబాబు నేతృత్వంలో గోపాలపట్నంకళలకు నిలయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ కళాపీఠానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో గోపాలపట్నం కళాపీఠం అధ్యక్షుడు గోరకల రామదాసు, మాజీ అధ్యక్షులు చందు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సింహాచలం, కొప్పిశెట్టి వెంకట్‌, మాజీ గౌరవాధ్యక్షులు కంపర కనకరాజు, రామచంద్రరావు, కొంతం నూకరాజేశ్వరరావు, అనపర్తి అప్పారావు, మిద్ది అప్పారావు, ఎల్లపు రమణ, లైబ్రరీ నరసింహం, మల్లేశ్వర ప్రసాద్‌ , విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

గణబాబును అభినందిస్తున్న దత్త ఎన్‌క్లేవ్‌ నివాసితులు

➡️