అబిద్‌నగర్‌లో కాంగ్రెస్‌ ప్రచారం

26వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న లక్కరాజు రామారావు

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు సోమవారం అబిద్‌నగర్‌, రామకృష్ణనగర్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకోవాలన్నా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలోని కొండవాలు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

➡️