పంటల నష్టానికి తక్షణమే సహాయం అందించాలి

Dec 8,2023 14:53 #Krishna district
congress visit crop damage

ప్రజాశక్తి-చల్లపల్లి : మిచౌంగ్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వింతా సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలోని వివిధ గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించి నేత మునిగిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్వయంగా పొలాలను పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని కోరారు. ఎకరాకు 30 వేల రూపాయలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు రెండో పంట పండించుకునేందుకు ఎరు వులు, విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు వెంటనే ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు జగ్గవరపు బాబురావు, ఎస్సీ సెల్ నాయకులు కలతోటి సాల్మన్ రాజు, యన్నం గంగాధరరావు, చల్లపల్లి వెంకటేశ్వరరావు, సయ్యద్ హుస్సేన్ కరీముల్లా ఖాన్, షేక్ మహబూబ్ సుభాని, చోరగుడి ప్రభాకర్, బడుగు పోతురాజు, వెలిశల సుబ్రహ్మణ్యం, కే గణేష్ బాబు, టి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️