ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Nov 26,2023 13:42 #Anantapuram District
constitution day in bommanahgal

ప్రజాశక్తి-బొమ్మనల్ : మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయం నందు ఆదివారం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఓ పి ఆర్ డి విజయమ్మ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ కొంతమంది మేధావులు భారతదేశం ఎలా పరిపాలించాలని ప్రజలకు సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధి ప్రజాస్వామ్యం అనే అంశాలపై రాజ్యాంగం నిర్మించి నవంబర్ 26 తారీఖున భారత అత్యున్నతమైన పార్లమెంట్ ఆమోదం వేసిందని ఈ రాజ్యాంగాన్ని నడిపించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా చట్టాలు ఏర్పాటు చేశారని ఎంత ఘనంగా మనకు రాజ్యాంగం అప్పగించిన మహా నేతలకు నివాళులర్పించడం మన ధర్మం అని వారు కొనియాడారు ఈ కార్యక్రమం అన్ని సచివాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామాంజనేయులు నెమకల్ సర్పంచ్ పరమేశ్వర శ్రీధర్ ఘట్ట సర్పంచ్ యోగేశ్వర్ రెడ్డి గుంతకల్ సర్పంచ్ ముక్కన్నా సింగేపల్లి సర్పంచ్ కృష్ణ వైస్ ఎంపీపీ రమేష్ మాజీ సర్పంచ్ కోటేశ్వర్ రెడ్డి గుర్రాజ్ గౌడు వైయస్సార్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి లోకేష్ రామకృష్ణ అనంతరాజు ఆయా గ్రామాల సచివాలయం సిబ్బంది స్టోర్ డీలర్లు ఉపాధి హామీ పథకం సిబ్బంది రెవిన్యూ సిబ్బంది ఎంపీడీవో సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️