కాంట్రాక్ట్‌ కార్మికులకు పెయిడ్‌ హాలిడేస్‌ ఇవ్వాలి

May 24,2024 00:01

మాట్లాడుతున్న నాగరాజు
ప్రజాశక్తి-గుంటూరు :
విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు పెయిడ్‌ హాలిడేస్‌ వెంటనే ఇవ్వాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.నాగరాజు డిమాండ్‌ చేశారు.గురువారం పాతగుంటూరులో నిర్వహించిన సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ మే 31 నాటికి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు పెయిడ్‌ హాలిడేస్‌ బకాయి వేతనాలను చెల్లించని పక్షంలో అన్ని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల వద్ద జూన్‌ 1 తరువాత ఆందోళన చేపడతామని దానికి విద్యుత్‌ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సెలవు దినాల్లో కూడా పనిచేసినందుకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా గత ఐదేళ్ల నుండి ఇవ్వకపోగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తక్షణమే చెల్లించమని కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచి ఆదేశాలున్నా చెల్లించకపోవడం కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల చిన్నచూపు అన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు కలుగజేసుకొని కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారం, పెయిడ్‌ హాలిడేస్‌ వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బి.లక్ష్మణరావు, కోశాధికారి జయరాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️