సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిని గెలిపించాలి

Apr 27,2024 21:43

ప్రజాశక్తి – భామిని : అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసయ్యకు సత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు మండలంలోని పెద్దదిమిలి, కొరమ, సతివాడ, పోలవరం పంచాయతీల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంతరం గిరిజన హక్కుల కోసం పోరాడుతూ, వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న పాచిపెంట అప్పల నరసయ్యను గెలిపించాలన్నారు. ఆయన గెలిస్తే మన వాణిని పార్లమెంట్‌ లో వినిపిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా బ్లాక్‌ పొందుపర్చిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కొండగొర్రి భాస్కరరావు, సిపిఎం మండల నాయకులు జగన్నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️