వైసీపీ, బీజేపీ కూటమిని ఓడించాలి: సీపీఎం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, దానికి మద్దతి స్తున్న రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేనలను, బీజేపీతో అంటకాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్‌ మాబు పిలుపునిచ్చారు. సీపీఎం సభ్యులు, సానుభూతిపరుల జనరల్‌ బాడీ సమావేశం స్థానిక సుందరయ్య భవనంలో నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతూ కార్మిక, రైతాంగ హక్కులను హరిస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి లోని బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలను, బిజెపికి తొత్తుగా ఉన్న వైసీపీని ఓడించాలని, ఇండియా బ్లాక్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు బంకా సుబ్బారావు, కె పెద్దబ్బాయి, మస్తాన్‌, అబ్బూరి వెంకటేశ్వర్లు, ఏవి సుబ్బారావు, ఎం సుబ్రహ్మ ణ్యం, డి చినబాబు, కె హనుమంతరావు, యు రాజు, నరసింహం, భగత్‌సింగ్‌ పాల్గొన్నారు.

➡️