మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 2,2024 13:07 #cpm, #Mangalagiri, #wide campaign

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ఈనెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా బ్లాక్‌ వేదిక తరపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావును, గుంటూరు పార్లమెంటు కు పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ లను గెలిపించాలని కోరుతూ గురువారం మంగళగిరి పట్టణంలోని భార్గవ్‌ పేట, పాత మంగళగిరి 24, 25 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, సిపిఎం పట్టణ నాయకులు ఏం చలపతిరావు, కుర్ర ఏడుకొండలు, సిపిఎం నాయకులు షేక్‌ కాసిం వలి, గోలి దుర్గాప్రసాద్‌, షేక్‌ రఫీ, యు సోమేశ్వరరావు, ఎస్‌ నరసింహారావు, సిపిఐ నాయకులు హరిప్రసాద్‌, సిపిఎం నాయకులు షేక్‌ కాశీం, వేణు, కే ఆంజనేయ రెడ్డి, రామకృష్ణ, బి స్వామినాథ్‌, ఆది నికల్సన్‌, ఎం కిరణ్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️