తోటలో గుర్తు తెలియని వృద్ధ మహిళ మృతదేహం

May 2,2024 11:42 #anakapalle district, #dead body

తాళ్లచీడికాడ (అనకాపల్లి) : తాళ్ళచీడికాడ గ్రామం శివారు తోటలో గుర్తు తెలియని వృద్ధ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం కేడిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు అమ్మిరెడ్డి సూర్యం (60)గా గుర్తించారు. ప్రభుత్వ భూమిలోని జీడితోట తోట చేబోలు మల్లేష్‌ లింగంపేటకు చెంది వ్యక్తిది. ఈ తోట కేడీపేటకు చెందిన యల్లపు నూకరాజు లీజుకు తీసుకొని ఈమెను కూలీకి పెట్టి పిక్కలు ఏరిస్తున్నారు. వృద్ధురాలిపై హత్యాచారం జరిగిందా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

➡️