బిజెపి తొత్తులను చిత్తుగా ఓడించండి

కాంగ్రెస్‌ సిపిఎం నాయకుల ప్రచారం

ప్రజాశక్తి -అచ్యుతాపురం :బిజెపిని, దాంతో అంటకాగిన టిడిపి, జనసేన, వైసిపిలను చిత్తుగా ఓడించాలని ఎలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని మోసాయిపేట, చౌడపల్లి, రామన్నపాలెం, అచ్యుతాపురం గ్రామాల్లో కాంగ్రెస్‌, సిపిఎం, ఇతర ఇండియా బ్లాక్‌ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అనంతరావు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, లక్షల కోట్లు అప్పులు చేసి దివాలా తీసేలా అవినీతి, అక్రమాలు, అరాచకాలతో పాలన సాగించిన జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఏ రకమైన ఎజెండా లేకుండా, తెలుగుదేశం పల్లకి మోయడానికి ఆవిర్భవించిన జనసేనకు బుద్ధి చెప్పాలన్నారు. వైసిపి, టిడిపి కూటమిల్లో ఎవరికి ఓటేసినా అది బిజెపికి చేరుతుందని, కేసుల భయంతో రెండు పార్టీలు కమలం పార్టీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎలమంచిలి ఎమ్మెల్యేగా తనను, అనకాపల్లి ఎంపీగా వేగి వెంకటేష్‌ను హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రిఅప్పారావు, బుద్ధ రంగారావు, కాండ్రేగుల రామా సదాశివరావు, రొంగలి రాము, కె సోమనాయుడు, ప్రజాతంత్ర మహిళా ప్రతినిధి ఆర్‌ లక్ష్మి, డిసిసి ఉపాధ్యక్షులు పి ఆదిమూర్తి, బి పెంటారావు, కాకి లక్ష్మి, నేెమాల లత, తుట ధనలక్ష్మి పోలార్పు లక్ష్మి, , పొట్నూరి చిన్నారి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ సిపిఎం నాయకుల ప్రచారం

➡️