మాతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి

May 4,2024 21:17

ప్రజాశక్తి-శృంగవరపుకోట, వేపాడ: టిడిపితోనే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. శనివారం ఎస్‌కోట మండలంలోని బొడ్డవర వద్ద ఓ కళ్యాణ మండపంలో వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుధారాజు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలోనూ, వేపాడ మండలంలోని బాణాదిలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ శ్రీభరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ మాట్లాడారు. టిడిపిలో చేరిన సుధారాణి, ఆమె గ్రూపుపై ఎమ్మెల్యే లేని పోని ఆరోపణలు చేసే ముందు ఆయన గిరిజన గ్రామాలకు ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు. నాయకుల మధ్య గొడవలు పెట్టి ఎమ్మెల్యే పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నట్లు చెప్పారు. చిట్టెం పాడులో సంఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, పాల్గొన్నారు.ప్రజా సేవ చేసేందుకు గెలిపించండి: బేబినాయనబొబ్బిలి: ప్రజా సేవ చేసేందుకు తనను గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన కోరారు. మున్సిపా లిటీలోని గొల్లపల్లిలో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సేవ చేసేందుకు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిం చారు. ఎన్నికల ప్రచా రంలో మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నాయకులు జి.అప్పల స్వామి, బాబు పాలూరి, బిజెపి నాయకులు రామారావునాయుడు పాల్గొన్నారు.బాడంగి : మండలంలోని పూడివలస, పాల్తేరు గ్రామాల్లో శనివారం బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమాన్ని బిసి సాధికార సమితి జిల్లా కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పూడివలస సర్పంచ్‌ రెడ్డి తిరుపతినాయుడు, పూడి రామకృష్ణ, టిడిపి నాయకులు పి.సత్తిబాబు, ఉడుముల సూర్యనారాయణ, కొల్లి అప్పలనాయుడు, వెన్నెల గణేష్‌, కొల్లి సత్యారావు, మరిపి బంగారునాయుడు పాల్గొన్నారు. ఆకులకట్ట పంచాయతీలోని దత్తి వెంకంపేటలో జరిగిన బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.జగన్‌ను గద్దె దించాలి : కొండపల్లి శ్రీనివాస్‌ జామి: సిఎం జగన్మోహన్‌ రెడ్డిని గద్దెదించి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని టిడిపి గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఓటర్లను కోరారు. శనివారం మండలంలోని లొట్లపల్లి, అట్టాడలో టిడిపి మండల అధ్యక్షులు పోరిపిరెడ్డి స్వామి నాయుడు ఆధ్వర్యంలో పర్యటించారు. లొట్లపల్లిలో మాజీ ఎంపిటిసి కడియాలా గోపి ఆధ్వర్యంలో 35 కుటుంబాలు టిడిపిలో చేరాయి. అట్టాడలో పలువురు టిడిపిలో చేరారు. ఈ సందర్బంగా కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మినేని శ్రీను, కొత్తలి సూర్యారావు, నాయకులు, పాల్గొన్నారు.రామభద్రపురం: టిడిపి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు మంచి గుర్తింపు నిచ్చిందని ఆర్య వైశ్యులంత రాబోయే ఎన్నికల్లో టిడిపికి మద్దతు ప్రకటించి చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు అడ్డా గోవింద రాజు కోరారు. ఆరికతోటలో శనివారం ఆర్యవైశ్యుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిడిపి మేనిఫెస్టోలో కూడా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఎన్నో అంశాలు పొందుపరిచారని తెలిపారు. ఆ సంఘ నేతలు పుసర్ల బాబ్జీ, శ్రీనివాసరావు, రామకృష్ణ పాల్గొన్నారు.

➡️