విద్యార్థులకు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ

Apr 12,2024 13:59 #Distribution, #free, #students

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : మండల కేంద్రమైన గుడ్లవల్లేరు సంతరోడ్డులోని శ్రీ సాయి విద్యానికేతన్‌ పాఠశాలలో 22మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు శుక్రవారం పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ సింగంశెట్టి ఆదినారాయణ తెలిపారు. జిఎస్టి మల్టీపుల్‌ కో ఆర్డినేటర్‌, ఇమ్మిడియేట్‌ పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్‌ దామర్ల శాంతి సహకారంతో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్‌ వైపిసి ప్రసాద్‌ తో విద్యార్థులకు కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్‌ లయన్‌ సింగంశెట్టి ఆదినారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️