నార్పల వైద్యశాలకు ఫురిఫైడ్ వాటర్ ఫిల్టర్ వితరణ

Mar 10,2024 14:33 #anathapuram, #government, #hospital

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రలోని ప్రభుత్వ వైద్యశాలకు ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నఅరుణ 20 వేల రూపాయల విలువ చేసే ఫురిఫైడ్ వాటర్ ఫిల్టర్ ని అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యశాలకు వచ్చే రోగులు, గర్భిణీల తాగు నీరు కోసం ఇబ్బంది పడకూడదు అన్న ఉదేశ్యంతో వాటర్ ఫిల్టర్ ను అందజేసినట్లు తెలిపారు. మహిళ ఉద్యోగి దాతృత్వం పట్ల వైద్యశాల వైద్యులు ప్రవీణ్, సాదియ లతో పాటు పలువురు సహా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అరుణ గొప్ప మనసు పలువురు ఉద్యోగులకు స్ఫూర్తి గా నిలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️