తాత్కాలిక జిల్లా న్యాయస్థానముల సముదాయము ప్రారంభం

Nov 25,2023 12:05 #West Godavari District
district court building open

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీరామపురం బి.ఎస్.ఎన్.ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక జిల్లా న్యాయస్థానముల సముదాయమును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భీమవరం పట్టణం మూడవ అడిషనల్ డిస్టిక్ జడ్జి పి.శ్రీ సత్య దేవి, సీనియర్ సివిల్ జడ్జి బి. అప్పలస్వామి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.పవన్ కుమార్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సురేష్ బాబు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి డి.ధనరాజ్, నరసాపురం 10వ అడిషనల్ డిస్టిక్ జడ్జి పి.విజయదుర్గ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వెంకటరమణారావు, సెక్రటరీ పి.రమేష్ బాబు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️