ఎన్నికల వేళ టిడిపి లో భారీగా చేరికలు

Apr 4,2024 17:02 #bapatla

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ లో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసిపి కి చెందిన పలువురు ముఖ్యనేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఇసుకదర్శి లోని ఎమ్మెల్లే క్యాంపు కార్యాలయంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు సమక్షంలో మార్టూరు బలరాం కాలనికి చెందిన పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక 13 వ వార్డ్ నంబర్ పెనబోయిన శ్రీనివాసరావు, రామిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏలూరి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి ఎమ్మెల్లే ఏలూరి కూటమి కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంఘటనకు ముందు వైసిపి నాయకులు కార్యకర్తలు పార్టీని వీడుతున్నారని సమాచారంతో వైసిపి ఎమ్మెల్లే అభ్యర్థి మార్టూరు లోని ఓ గుడి ప్రాంగణంలో సదరు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సన్నిహితులతో పార్టీని వీడొద్దని ఎంత నచ్చచెప్పించినప్పటికీ సదరు నాయకులు ససేమిరా అంటూ టిడిపి ఎమ్మెల్లే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయానికి చేరుకొని టిడిపి కండువా కప్పుకోవడం విశేషం. ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసాయి. క్రమేపి వైసిపి కి చెందిన పర్చూరు నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ లో చేరడానికి వరుస కడుతుండటంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

➡️