అంబేద్కర్‌ స్ఫూర్తితో పని చేస్తా

Mar 10,2024 23:51
అంబేద్కర్‌ స్ఫూర్తితో పని చేస్తా

ప్రజాశక్తి-తాళ్లపూడిప్రపంచ మేధావి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణకు పని చేస్తానని ఎస్‌సి కమిషన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. వేగేశ్వరపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యువతకు హక్కుల మరియు జీవనోపాధిపై పలు సూచనలు చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. రాజ్యాంగంలో యువతకు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయన్నారు. సమాజంలోని ప్రజలు అందరూ స్వేచ్ఛగా బతకడానికి అంబేద్కర్‌ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని భావితరాలకు రాజ్యాంగాన్ని అందించారన్నారు. అనంతరం బల్లిపాడు, వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట భానుచందర్‌, గూడా విజయరాజు, యాళ్ల సునీల్‌, కె.అశోక్‌, యు.రవి, కె.భీమరాజు, ఎ.శ్రీను, కె.శివయ్య, పి.కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

➡️