‘ఆడుదాం ఆంధ్రా’తో ప్రతిభ వెలికితీత

Jan 24,2024 22:24
'ఆడుదాం ఆంధ్రా'తో ప్రతిభ వెలికితీత

జిల్లాలో పలుచోట్ల బుధవారం ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రజాశక్తి- యంత్రాంగం రాజమహేంద్రవరం రూరల్‌ గ్రామీణ ప్రాంతంలో యువకుల క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. హుకుంపేటలో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ స్థాయి ఆడుదాం..ఆంధ్రా ఆయన ప్రారంభించారు. జాతీయస్థాయి వాలీబాల్‌, బాక్సింగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వై.లలితా దేవి, ఎన్‌.ప్రజ్ఞను మెమెంటో, శాలువాలతో ఆయన ఘనంగా సత్కరించారు. వారిని క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి వి.స్వామి నాయుడు, స్పెషల్‌ ఆఫీసర్‌ కెఎన్‌.జ్యోతి, డిపిఒ జెవి సత్యనారాయణ, ఎంపిడిఒ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో క్రీడీలను ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, విసి ఆచార్య కె.పద్మరాజు, ఆర్‌డిఒ చైత్ర వర్షిణి ప్రారంభించారు. తహశీల్దారు పవన్‌ కుమార్‌, ఎంపిడిఒ సుబ్రమణ్యం, వైసిపి నాయకులు మందారపు వీర్రాజు, ప్రగాడ చక్రి, నాగవరపు త్రిమూర్తులు, ఆకుల శ్రీను పాల్గొన్నారు. చాగల్లు నియోజకవర్గ స్థాయి క్రీడల్లో భాగంగా కొవ్వూరులో జరిగిన పోటీల్లో చాగల్లు మండలం నుండి ప్రాతినిధ్యం వహించిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ టీం ఫైనల్‌లో గెలిచి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్స్‌ టీమ్‌ ఫైనల్‌లో గెలిచి విజేతగా నిలిచింది. క్రికెట్‌ మెన్స్‌ టీమ్‌ ఫైనల్‌లో గెలిచి విజేతగా నిలిచింది. విజేతలు, పీడీలు, పిఇటిలను ఎంపిపి మట్టా వీరాస్వామి, జెడ్‌పిటిసి గారపాటి విజయ దుర్గా, ఎంపిడిఒ పి.నిర్మల కుమారి అభినందించారు.

➡️