ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

Mar 3,2024 23:26
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంనగరంలోని టిడిపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని రాజమండ్రి ఎంపీ, వైసిపి సిటీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్‌ మాట్లాడారు. ప్రతి పనిలో 25 శాతం కమీషన్‌ తీసుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు ఆరోపించడం కాదని, సాక్ష్యాధారాలతో ఒక్క శాతం కమీషన్‌ తీసుకున్నట్టు నిరూపించినా రాజకీయాలకు స్వస్తి చెబుతానన్నారు. ఆ కుటుంబంలో ఒకరు మేయర్‌గా చేసినప్పుడు మీ ముగ్గురు దందాలు ఎవరికి తెలియవని ప్రశ్నించారు. ఆఖరికి స్కాంవెంజర్స్‌, వర్కర్స్‌, శానిటేషన్‌ మేస్త్రీలు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఇలా అందరి దగ్గరా కాసులు గుంజే సంస్కతి వారిదని ఆరోపించారు. మీ అవినీతి అక్రన బాగోతాలు ఎవరికీ తెలియంది కాదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి అద్దె ఇంటిలో ఉంటూ సైకిల్‌పై సామాన్య జీవితాన్ని గడిపిన ఆ వ్యక్తి ఎలా వందల కోట్లు గడించాడో చెప్పాలన్నారు. తాను ఎంపీగా రెండున్నరేళ్ళలో చేసినంత అభివద్ధి పదవులు అనుభవించిన 16 ఏళ్ల కాలంలో చేశారా అని ఎంపీ భరత్‌ ప్రశ్నించారు.

➡️