ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Feb 14,2024 22:31

ప్రజాశక్తి – గోపాలపురం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని గోపాలపురం తాలూకా యూనిట్‌ జెఎసి నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం గోపాలపురం తాలూకా యూనిట్‌ తాళ్లపూడి, దేవరపల్లి, గోపాలపురం మండలాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు రావాల్సిన డిఎ ఎరియర్స్‌, పిఆర్‌సి బకాయిఉలు, బీమా బకాయిలు, సంపాదిత సెలవుల బకాయిలను విడుదల చేయాలన్నారు. సిపిఎస్‌ను రద్దు చేయాలన్నారు. జెఎసి పిలుపు మేరకు దశల వారీ ఆందోళన చేపట్టామన్నారు 27వ వరకూ వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్‌ జోడాల వెంకట్‌, ఉపాధ్యాయ సంఘ ప్రతినిథులు జి.వెంకటేశ్వరరావు, ఎ.జాన్‌బాబు, శ్రీను, దోసయ్య, నాగేశ్వర రావు, మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️