ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Jan 26,2024 00:05
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువార పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాశక్తి- యంత్రాంగంరాజమహేంద్రవరం రూరల్‌ ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం, ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును తప్పనసరిగా వినియోగించుకోవాలని తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఆనం కళా కేంద్రంలో సాంస్కతిక, అవార్డ్‌ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేశారు. హక్కుల కోసం అడిగే అవకాశం ఓటు హక్కు వినియోగించుకునే వారికే ఉంటుందని, ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. ఐదేళ్ల పాటు పాలించే వారిని ఎన్నుకునే అవకాశం మనకు ఉందని తెలిపారు. ప్రజా స్వామ్య వ్యవస్థ లో ఓటు ఒక వజ్రాయుధం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఎఎస్‌పి జి.వెంకటేశ్వర రావు, డిఇఒ ఎస్‌.అబ్రహౄం, గిరిజన సంక్షేవమాధికారి కెఎస్‌.జ్యోతి, అదనపు కమిషనర్‌ పిఎం.సత్యవేణి, డిఐఒ జెవిఎల్‌.సుబ్రమణ్యం పాల్గొన్నారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఇఆర్‌ఒ ఎస్‌. సరళా వందనం జెడ్‌పి హైస్కూల్లో సీనియర్‌ ఓటర్‌ సిటిజన్స్‌ను సత్కరించారు. గోకవరం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి కె.ప్రియదర్శిని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపిటిసి పులపర్తి బుజ్జి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లపూడి తహశీల్దారు రాధిక, ఎంపిడిఒ రమణ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాళ్లపూడి బస్టాండ్‌ సెంటర్‌ నుండి పైడిమెట్ట జంక్షన్‌ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఇఒపిఆర్‌డి వీరన్న, పలు శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. చాగల్లు మండల పరిషత్‌ పాఠశాలలో సీనియర్‌ ఓటర్లను ఘనంగా సత్కరించారు. విఆర్‌ఒ మధుబాబు, కె.దినేష్‌ కుమార్‌, హెచ్‌ఎం పిల్లి శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయులు పొన్న శ్వేత, ఎం.అజరు, బి.విజయదుర్గ, జె.రంజని, ఎం.పావని, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెరవలి తహశీల్దారు టి.రాజరాజేశ్వరి అధ్యక్షతన సీనియర్‌ ఓటర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు అధికారులచే ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. డిప్యూటీ తాసిల్దార్‌ కనకదుర్గ, ఆర్‌ఐ పులిదిండి పావని, విఆర్‌ఒ సొంగరాజు పాల్గొన్నారు.

➡️