టిడిపి ఆధ్వర్యంలో ‘యువగళం’ వేడుకలు

Jan 28,2024 00:13
టిడిపి

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
టిడిపి అధినేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని శ్యామలానగర్‌ రామాలయం సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంటో టిడిపి రాష్ట్ర కార్యనిర్వావహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి, 108 కొబ్బరి కాయలు కొట్టి వేడకలు నిర్వహించారు. నక్కా సంతోష్‌ సమకూర్చిన మూడు ట్రై సైకిళ్లను వికలాంగులకు అందించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్‌ కూడా మంచి విజన్‌ ఉన్న నాయకుడన్నారు. తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్‌ అని అన్నారు. యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. నక్కా దేవీవరప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్‌ తన పాదయాత్రను పూర్తి చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, టిఎన్‌టియుసి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు పాల్గొన్నారు.

➡️