నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేణు

Feb 11,2024 22:45
చేనేత కార్మికుల ఆర్థిక

ప్రజాశక్తి – కడియం

చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని మురముండ గ్రామ పంచాయతీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన మురమండ, దుళ్ల, వీరవరం, పొట్టిలంక గ్రామాల చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం, చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా 557 మంది చేనేత కార్మికుల కుటుం బాలకు రు. 191 లక్షల ప్రయోజనం చేకూ ర్చడం జరిగిందన్నారు. 2023-24 సంవత్స రానికి 2వ విడతగా 170 మంది చేనేత కార్మిక లబ్ధిదారులకు రూ.40 లక్షల విలువైన వ్యక్తిగత వర్క్‌ షెడ్లు, వివిధ రకాల చేనేత ఉప కరనాలను అందించినట్లు చెప్పారు. 2022-23లో మొదటి విడతగా రూ.53.669 లక్షల విలువ గల ఉపకర ణాలను అందించామ న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్‌ బ్యూటిఫి కషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌, చేనేత జౌలి శాఖ ప్రాంతీయ ఉపసంచాల కులు ధనుంజయరావు, ఎడి కె.పెద్ది రాజు, డిఒ రవికుమార్‌, ఎడిఒ చేతన్‌, గ్రామ సర్పం చ్‌ అయినమిల్లి రుక్మిణి, చేనేత సొసైటీ అధ్య క్షులు యర్రా సూర్యనారాయణ పాల్గొన్నారు.

➡️