ప్రతీ కుటుంబానికి రూ.1.20 లక్షల సాయం

Feb 29,2024 22:14
టిడిపి - జనసేన

ప్రజాశక్తి – పెద్దాపురం
టిడిపి – జనసేన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి రూ.1.20 లక్షలు సాయా న్ని అందిస్తామని ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల శంఖారావం పేరుతో నియోజక వర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి పాలనలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. పార్టీలో చేరేందుకు ఎవరు ముందుకు వచ్చినా చేర్చుకునేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేపట్టాలి, ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి, నోటిఫికేషన్‌ ముందు, నోటిఫికేషన్‌ తర్వాత ప్రచారం చేసే తీరును వివరించారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాల న్నారు. గ్రామాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలను కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. మార్చి 5వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం వార్డుల వారీగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రాజా సూరిబాబు రాజు, కాకినాడ రామారావు,కొత్తిం వెంకట శ్రీనివాసరావు(కోటి), తోటకూర శ్రీనివాస్‌, నిమ్మకాయల రంగనాగ్‌, అడబాల కుమార్‌ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

➡️