జీవో నెంబర్ 117 రద్దు చేయాలి : ఎమ్మెల్యే రాజప్పకు ఎస్టియు నాయకులు వినతి

Jun 20,2024 16:01 #G.O 117, #Kakinada

ప్రజాశక్తి -సామర్లకోట :  జీ.వో నెం 117 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే’ అమ్మకు వందనం” అందించాలని, ప్రాథమిక విద్యను మాతృ భాషలో, సెకండరీ విద్యను తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉంచాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కువిజ్ఞప్తి చేశారు. సామర్లకోట మండలం అచ్చంపేట ఎమ్మెల్యే నివాసంలో గురువారం ఎస్టియు నాయకులు మూడోసారి పెద్దాపురం ఎమ్మెల్యే గా విజయం సాధించిన రాజప్ప ను పూల మాలలు, దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు.ఎమ్మేల్యే రాజప్ప సానుకూలంగా స్పందించి సమస్యలను విద్యాశాఖ మంత్రి తో చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోర్త శ్రీనివాస్, కాశి విశ్వనాథ్, జిల్లా నాయకులు అర్జున్ కుమార్, శ్రీరామ చంద్రమూర్తి,జిలానీ, టి.వి.వి.సత్యనారాయణ, సామర్ల కోట ఎస్ టి యు నాయకులు చిట్టిబాబు, శ్రీనివాసరావు, సిహెచ్.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️