సాధికారత వర్క్‌ షాప్‌నకు స్పందన

Jan 24,2024 22:30
సాధికారత వర్క్‌ షాప్‌నకు స్పందన

ప్రజాశక్తి-రాజానగరం ఎపిలో యువ సాధికారత, ఉపాధి అనే అంశంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన వర్క్‌ షాప్‌నకు విశేష స్పందన వచ్చింది. విశ్వవిద్యాలయ ప్రాంగణాల అధ్యాపకులతో పాటు అనుబంధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఈ వర్క్‌ షాప్‌నకు హాజరయ్యారు. విసి ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ వర్క్‌ షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి పద్మరాజు మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై త్వరలో నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఆచార్య కె.శ్రీరమేష్‌, కో కన్వీనర్‌ డాక్టర్‌ పి.ఉమామహేశ్వరి దేవి, డాక్టర్‌ ఎన్‌.ఉదయభాస్కర్‌, డాక్టర్‌ సుజాత పాల్గొన్నారు.

➡️